Friday 31 March 2023

పేరు మార్పు

అబ్బ, ఆగవయ్యా, ఒకటే తొందర పెడుతున్నావు. కాసేపు మమ్మల్ని మా అమ్మతో ముచ్చట్లు చెప్పుకోనీ?.. 

ఎంత సేపూ నీ గొడవేనా?. ఏమిటీ, పెళ్ళి ముహూర్తం దగ్గర పడిందా?. ఇంతకీ ఎవరా పెళ్ళికూతురు?.

ఏమిటీ విడ్డూరం. మా అమ్మేనా పెళ్ళికూతురు. మరీ బావుంది. అప్పుడెప్పుడో త్రేతాయుగంలోనే పెళ్ళి చేసుకుని తాళి కట్టావుగదా, ఇంక మళ్ళీ పెళ్ళి దేనికిట? మీ పెళ్ళి ముచ్చట్లు ఆపి మా అమ్మతో మమ్మల్ని కాస్త మాట్లాడుకోనీ. అసలే బోల్డు మాటలు మిగిలిపోయి ఉన్నయ్యి. పోనీలే ఓసారి నిన్ను ఏదన్నా అడుగుదామని దగ్గరకొస్తే నువ్వేమో నీతిసూత్రాలూ, ధర్మ శాస్త్రాలూ చెబుతావాయె. ఇంక నీతో నాకేమి పని. ఎంచక్కగా మా అమ్మ ఎదురుగ్గా కూచుని పాట కట్టి వైదేహి, నా భాగ్యమా, దేహి, దేహి అని కాస్సేపు పొగిడితే, ఆనందంతో భాష్పాలు రాలుస్తూ దగ్గరకు తీసుకుని చక్కగా ముద్దు పెట్టి జుట్టు సరిచేసి ఏది కావాలంటే అది ఇచ్చేస్తుంది మా అమ్మ వైదేహి. ఇంక నాకు ఎవ్వరితో ఏమి పని ఉంటుంది?

కానీ అప్పుడప్పుడూ అమ్మ ఏదో ధ్యాసలో ఉన్నట్టుంటుంది. ఎంత ప్రయత్నించినా మాట్లాడదు. ఎన్ని రకాలుగా పిలిచినా బొమ్మలాగా ఉలకదు, పలకదు. కానీ నాకు అలా పరధ్యానంగా కూచున్న అమ్మని ఎలా పలకరిస్తే నావైపు చిరునవ్వుతో చూస్తుందో తెలుసు. అందరు ఆడవాళ్ళకీ పుట్టింటి మీద కాస్త ఎక్కువ ప్రేమ ఉండటం సహజం కదా. అందుకని అట్లాంటప్పుడు నేను, అమ్మా, జానకీ, జానకమ్మ పిలుస్తాను. అప్పుడు మా తల్లీ కరుణాపాంగ తల్లీ అని వీక్షణాలతో నన్ను చూసి నవ్వుతుంది.

                           - జొన్నలగడ్డ సౌదామిని.

పేరు మార్పు

అబ్బ, ఆగవయ్యా, ఒకటే తొందర పెడుతున్నావు. కాసేపు మమ్మల్ని మా అమ్మతో ముచ్చట్లు చెప్పుకోనీ?..  ఎంత సేపూ నీ గొడవేనా?. ఏమిటీ, పెళ్ళి ముహూర్తం దగ్గ...