Friday 31 March 2023

పేరు మార్పు

అబ్బ, ఆగవయ్యా, ఒకటే తొందర పెడుతున్నావు. కాసేపు మమ్మల్ని మా అమ్మతో ముచ్చట్లు చెప్పుకోనీ?.. 

ఎంత సేపూ నీ గొడవేనా?. ఏమిటీ, పెళ్ళి ముహూర్తం దగ్గర పడిందా?. ఇంతకీ ఎవరా పెళ్ళికూతురు?.

ఏమిటీ విడ్డూరం. మా అమ్మేనా పెళ్ళికూతురు. మరీ బావుంది. అప్పుడెప్పుడో త్రేతాయుగంలోనే పెళ్ళి చేసుకుని తాళి కట్టావుగదా, ఇంక మళ్ళీ పెళ్ళి దేనికిట? మీ పెళ్ళి ముచ్చట్లు ఆపి మా అమ్మతో మమ్మల్ని కాస్త మాట్లాడుకోనీ. అసలే బోల్డు మాటలు మిగిలిపోయి ఉన్నయ్యి. పోనీలే ఓసారి నిన్ను ఏదన్నా అడుగుదామని దగ్గరకొస్తే నువ్వేమో నీతిసూత్రాలూ, ధర్మ శాస్త్రాలూ చెబుతావాయె. ఇంక నీతో నాకేమి పని. ఎంచక్కగా మా అమ్మ ఎదురుగ్గా కూచుని పాట కట్టి వైదేహి, నా భాగ్యమా, దేహి, దేహి అని కాస్సేపు పొగిడితే, ఆనందంతో భాష్పాలు రాలుస్తూ దగ్గరకు తీసుకుని చక్కగా ముద్దు పెట్టి జుట్టు సరిచేసి ఏది కావాలంటే అది ఇచ్చేస్తుంది మా అమ్మ వైదేహి. ఇంక నాకు ఎవ్వరితో ఏమి పని ఉంటుంది?

కానీ అప్పుడప్పుడూ అమ్మ ఏదో ధ్యాసలో ఉన్నట్టుంటుంది. ఎంత ప్రయత్నించినా మాట్లాడదు. ఎన్ని రకాలుగా పిలిచినా బొమ్మలాగా ఉలకదు, పలకదు. కానీ నాకు అలా పరధ్యానంగా కూచున్న అమ్మని ఎలా పలకరిస్తే నావైపు చిరునవ్వుతో చూస్తుందో తెలుసు. అందరు ఆడవాళ్ళకీ పుట్టింటి మీద కాస్త ఎక్కువ ప్రేమ ఉండటం సహజం కదా. అందుకని అట్లాంటప్పుడు నేను, అమ్మా, జానకీ, జానకమ్మ పిలుస్తాను. అప్పుడు మా తల్లీ కరుణాపాంగ తల్లీ అని వీక్షణాలతో నన్ను చూసి నవ్వుతుంది.

                           - జొన్నలగడ్డ సౌదామిని.

Sunday 11 December 2022

అవధూత గీత-- నాలుగు, అయిదు అధ్యాయములు

 అథ చతుర్థోఽధ్యాయః 

ఇది నాలుగో అధ్యాయము

 

నావాహనం నైవ విసర్జనం వా

    పుష్పాణి పత్రాణి కథం భవన్తి 

ధ్యానాని మన్త్రాణి కథం భవన్తి

    సమాసమం చైవ శివార్చనం   ౧॥

ఆవాహనమూ విసర్జనమూ అవసరం ఏమిటి?.  పుష్పాలూపత్రాలూవాటితో పూజల అవసరం ఏమిటి?. ధ్యానాలూమంత్రాల అవసరం ఏమిటి?. శివుడూధ్యానం చేసేవాడూ ఒకటే అనుకోవటమే శివుణ్ణి అర్చించటం


 

 కేవలం బన్ధవిబన్ధముక్తో

     కేవలం శుద్ధవిశుద్ధముక్తః 

 కేవలం యోగవియోగముక్తః

     వై విముక్తో గగనోపమోఽహమ్  ౨॥

నేను బంధాలనీముక్తులనీ వదలిపెట్టిన వాణ్ణి మాత్రమే కానునేను శుద్ధమూవిశుద్ధమూ వదలిపెట్టినవాణ్ణి మాత్రమేకానునేను కలవడమూవిడిపోవడమూ వదిలి పెట్టిన వాణ్ణి మాత్రమే కానునేను అన్నిటినీ వదిలి ఆకాశం లాగాఉన్నవాణ్ణి

 

సఞ్జాయతే సర్వమిదం హి తథ్యం

    సఞ్జాయతే సర్వమిదం వితథ్యమ్ 

ఏవం వికల్పో మమ నైవ జాతః

    స్వరూపనిర్వాణమనామయోఽహమ్  ౩॥

కొందరు  ప్రపంచమంతా సత్యం అంటారు కొందరు  ప్రపంచమంతా అసత్యం అంటారుఇట్లాంటి వాదాలు అర్ధంలేనివి అనిపిస్తుంది నాకునా స్వరూపం మాయలేకుండా వెలిగే నిర్వాణమే

 

 సాఞ్జనం చైవ నిరఞ్జనం వా

     చాన్తరం వాపి నిరన్తరం వా 

అన్తర్విభన్నం  హి మే విభాతి

    స్వరూపనిర్వాణమనామయోఽహమ్  ౪॥

నాలో  దోషాలూ లేవునాలో దోషాలు లేకుండా లేవునాకు మొదలు లేదునాకు మొదలు లేకుండా లేదునాకుభిన్నత్వమూ లేదుఏకత్వమూ లేదునా స్వరూపం మాయలేకుండా వెలిగే నిర్వాణమే

 

అబోధబోధో మమ నైవ జాతో

    బోధస్వరూపం మమ నైవ జాతమ్ 

నిర్బోధబోధం  కథం వదామి

    స్వరూపనిర్వాణమనామయోఽహమ్  ౫॥

అజ్ఞానమూజ్ఞానమూ నాలో ఎప్పుడూ పుట్టవుజ్ఞాన స్వరూపం ఏమిటో కూడా నాకు తెలీదుఅలాంటి నేను జ్ఞానంఉండటం గురించీలేకపోవటం గురించీ ఏమి చెప్పనునాస్వరూపం మాయలేకుండా వెలిగే నిర్వాణమే

 

 ధర్మయుక్తో   పాపయుక్తో

     బన్ధయుక్తో   మోక్షయుక్తః 

యుక్తం త్వయుక్తం   మే విభాతి

    స్వరూపనిర్వాణమనామయోఽహమ్  ౬॥

నేను ధర్మంతో కూడిన వాణ్ణి కానునేను పాపంతో కూడిన వాణ్ణి కానుబంధంతో ఉన్నవాణ్ణీ కానుమోక్షంతో కూడినవాణ్ణీ కానుసరి అయినదీసరి కానిదీ రెండూ నాకు తెలియవునాస్వరూపం మాయలేకుండా వెలిగే నిర్వాణమే

 

పరాపరం వా   మే కదాచిత్

    మధ్యస్థభావో హి  చారిమిత్రమ్ 

హితాహితం చాపి కథం వదామి

    స్వరూపనిర్వాణమనామయోఽహమ్  ౭॥

గొప్పదీతక్కువదీమధ్యలోదీ అనే భావాలు నాకు కొద్దిగా కూడా లేవునాకు శత్రువులూమిత్రులూ ఎవరూ లేరుఅలాంటప్పుడుమంచీ చెడ్డా గురించి ఎలా మాట్లాడనునా స్వరూపం మాయలేకుండా వెలిగే నిర్వాణమే

 

నోపాసకో నైవముపాస్యరూపం

     చోపదేశో   మే క్రియా  

సంవిత్స్వరూపం  కథం వదామి

    స్వరూపనిర్వాణమనామయోఽహమ్  ౮॥

నేను ఉపాసకుణ్ణి కానుఉపాసింపబడే రూపాన్ని కానునేను  ఉపదేశాన్నీ ఇవ్వను పూజలూక్రియలూ చేయనుచైతన్య స్వరూపుడిని అయిన నేను ఎలా మాట్లాడగలను?. నా స్వరూపం మాయ లేకుండా వెలిగే నిర్వాణమే


 

నో వ్యాపకం వ్యాప్యమిహాస్తి కిఞ్చిత్

     చాలయం వాపి నిరాలయం వా 

అశూన్యశూన్యం  కథం వదామి

    స్వరూపనిర్వాణమనామయోఽహమ్  ౯॥

వ్యాపించినదీ,   వ్యాపించ బడినదీరెండూ కొంచెం కూడాలేవు కనిపించే సృష్టీదాని నాశనమూ రెండూ లేవుఅలాటప్పుడు శూన్యం అనీ శూన్యం కానిది అనీ నేను ఎట్లా చెప్పేది?. నా స్వరూపం మాయ లేకుండా వెలిగే నిర్వాణమే

 

 గ్రాహకో గ్రాహ్యకమేవ కిఞ్చిత్

     కారణం వా మమ నైవ కార్యమ్ 

అచిన్త్యచిన్త్యం  కథం వదామి

    స్వరూపనిర్వాణమనామయోఽహమ్  ౧౦॥

నేను కొద్దిగాకూడాగ్రహించేవాణ్ణి కానుగ్రహించబడే విషయాన్నీ కానునేను కార్యాన్నీ కాదుదాని ఫలితాన్నైనకారణాన్నీ కానుఅలాంటప్పుడుఆలోచించే వాడి గురించీఆలోచిచ్బడే విషయాల గురించీ ఏమి చెప్పనునాస్వరూపం మాయ లేకుండా వెలిగే నిర్వాణమే

 

 భేదకం వాపి  చైవ భేద్యం

     వేదకం వా మమ నైవ వేద్యమ్ 

గతాగతం తాత కథం వదామి

    స్వరూపనిర్వాణమనామయోఽహమ్  ౧౧॥

భేదించేదీ  నేను కాదుభేదింపబడేదీ నేను కాదుతెలియబడేవాణ్ణి నేను కాదుతెలియబడేదీ నేను కాదుఅలాంటప్పుడుప్రపంచం పుట్టుకాగిట్టటమూ గురించి ఏమి చెప్పేదినా స్వరూపం మాయ లేకుండా వెలిగేనిర్వాణమే

 

 చాస్తి దేహో   మే విదేహో

    బుద్ధిర్మనో మే  హి చేన్ద్రియాణి 

రాగో విరాగశ్చ కథం వదామి

    స్వరూపనిర్వాణమనామయోఽహమ్  ౧౨॥

నాకు దేహమే లేదుదేహం లేకుండా నేను లేనుబుద్ధీమనస్సూ,ఇంద్రియాలూ నాకు లేవుఅలాంటప్పుడుఅనురాగమూరాగంలేకుండా ఉండటమూ గురించి ఏమి చెప్పాలి?. నా స్వరూపం మాయ లేకుండా వెలిగే నిర్వాణమే

 

ఉల్లేఖమాత్రం  హి భిన్నముచ్చై-

    రుల్లేఖమాత్రం  తిరోహితం వై 

సమాసమం మిత్ర కథం వదామి

    స్వరూపనిర్వాణమనామయోఽహమ్  ౧౩

ఆత్మకి   వేరుగా ఉన్నదాని గురించి ఎవరూ మాట్లాడలేరులేనిదాన్ని గురిచి ఎవ్వరూ మాట్లాడలేరుఅలాంటప్పుడుసమానంసమానం కాదు అనే మాటలు ఎలా మాట్లాడగలంనా స్వరూపం మాయ లేకుండా వెలిగే నిర్వాణమే

 

జితేన్ద్రియోఽహం త్వజితేన్ద్రియో వా

     సంయమో మే నియమో  జాతః 

జయాజయౌ మిత్ర కథం వదామి

    స్వరూపనిర్వాణమనామయోఽహమ్  ౧౪॥

నేను.    జజితేంద్రియుణ్ణి.నేను జితేంద్రియుణ్ణి కానునాకు యమాలూనియమాలూ లేనేలేవుగెలుపూఓటమీ నాకుఎలా ఉంటాయి మిత్రమాచెప్పునా స్వరూపం మాయ లేకుండా వెలిగే నిర్వాణమే

 

అమూర్తమూర్తిర్న  మే కదాచి-

    దాద్యన్తమధ్యం   మే కదాచిత్ 

బలాబలం మిత్ర కథం వదామి

    స్వరూపనిర్వాణమనామయోఽహమ్  ౧౫॥

నాకు రూపం ఎప్పుడూ లేదురూపం లేకుండా కూడా లేనుమొదలూమధ్యాచివరానాకు కొద్దిగా కూడా లేవుయవ్వనంలో బలం ఉండటమూముసలితనంలో బలం లేకపోవటమూ గురించి ఏమి చెప్పనునా స్వరూపం మాయలేకుండా వెలిగే నిర్వాణమే

 

మృతామృతం వాపి విషావిషం 

    సఞ్జాయతే తాత  మే కదాచిత్ 

అశుద్ధశుద్ధం  కథం వదామి

    స్వరూపనిర్వాణమనామయోఽహమ్  ౧౬॥

మృత్యువుని కానీఅమృతత్వాన్ని కానీ విషాన్ని కానీవిషం కాని దాన్నీ ఇలా పరస్పర వ్యతిరేకార్ధక ద్వంద్వాలుచిన్నవాడానావద్ద పుట్టనేలేదుఅలాంటప్పుడుశుద్ధమూఅశుద్ధమూ అనేవాటి గురించి ఏమి చెప్పను?. నాస్వరూపం మాయ లేకుండా వెలిగే నిర్వాణమే

 

స్వప్నః ప్రబోధో   యోగముద్రా

    నక్తం దివా వాపి  మే కదాచిత్ 

అతుర్యతుర్యం  కథం వదామి

    స్వరూపనిర్వాణమనామయోఽహమ్  ౧౭॥

కలా మెలకువాయోగముద్రలూ లాంటివి నా అనుభవంలో లేవురాత్రీపగలూ అనేవి నాకు కొద్దిగా కూడా లేవుఅలాంటప్పుడుమనస్సుకున్న అవస్థలగురించి ఏమి చెప్పేది?. నా స్వరూపం మాయ లేకుండా వెలిగే నిర్వాణమే

 

సంవిద్ధి మాం సర్వవిసర్వముక్తం

    మాయా విమాయా   మే కదాచిత్ 

సన్ధ్యాదికం కర్మ కథం వదామి

    స్వరూపనిర్వాణమనామయోఽహమ్  ౧౮॥

 ప్రపంచం కనిపించినా,కనిపించకపోయినా దానివల్ల నేను ఏవిధంగానూ ప్రభావితుడిని అవను అని చక్కగాతెలుసుకోమాయ ఉండటమూ,లేకపోవటమూ నాకు కొద్దిగా కూడా లేదుఅలాంటప్పుడు సంధ్యా వందనం లాంటికర్మల గురించి  ఏమి చెప్పేది?. నా స్వరూపం మాయ లేకుండా వెలిగే నిర్వాణమే

 

సంవిద్ధి మాం సర్వసమాధియుక్తం

    సంవిద్ధి మాం లక్ష్యవిలక్ష్యముక్తమ్ 

యోగం వియోగం  కథం వదామి

    స్వరూపనిర్వాణమనామయోఽహమ్  ౧౯॥

నన్నుఅన్ని రకాల సమాధి విశేషాలూ తెలిసినవాడిగా గ్రహించునన్నుసమాధిని పొందినా పొందకున్నా ప్రభావితుడుకానివాడుగా తెలుసుకోఅలాంటప్పుడు కలవడమూయోగము), విడిపోవడమూ గురించి ఏమి మాటాడను?. నాస్వరూపం మాయ లేకుండా వెలిగే నిర్వాణమే

 

మూర్ఖోఽపి నాహం   పణ్డితోఽహం

    మౌనం విమౌనం   మే కదాచిత్ 

తర్కం వితర్కం  కథం వదామి

    స్వరూపనిర్వాణమనామయోఽహమ్  ౨౦॥

నేను    మూర్ఖుణ్ణి కానుపండితుడినీ కానుమాట్లాడటంమౌనంగా ఉండటం లాంటివి నాకు కొద్దిగా కూడా లేవుఅలాంటప్పుడు తర్కమూవితర్కమూ గురించి  ఏమి చెప్పేది?. నా స్వరూపం మాయ లేకుండా వెలిగే నిర్వాణమే

 

పితా  మాతా  కులం  జాతి-

    ర్జన్మాది మృత్యుర్న  మే కదాచిత్ 

స్నేహం విమోహం  కథం వదామి

    స్వరూపనిర్వాణమనామయోఽహమ్  ౨౧॥

నాకు తండ్రీతల్లీకులమూజాతీ లేవుపుట్టుకా చావూ నాకు ఎప్పుడూ లేవుఇక స్నేహమూదాని వల్ల కలిగేమోహమూ గురించి ఏమి చెప్పను?. నా స్వరూపం మాయ లేకుండా వెలిగే నిర్వాణమే

 

అస్తం గతో నైవ సదోదితోఽహం

    తేజోవితేజో   మే కదాచిత్ 

సన్ధ్యాదికం కర్మ కథం వదామి

    స్వరూపనిర్వాణమనామయోఽహమ్  ౨౨॥

అస్తమించకుండా .  ఎప్పుడూ ఉదయించిన వాణ్ణేతేజస్సు ఉండటమూలేకపోవటమూ నాకు కొంచెం కూడా లేదుఅలాంటప్పుడు సంధ్యావందం లాంటి కర్మల గురించి ఏమి చెప్పనునా స్వరూపం మాయ లేకుండా వెలిగే నిర్వాణమే

 

అసంశయం విద్ధి నిరాకులం మాం

    అసంశయం విద్ధి నిరన్తరం మామ్ 

అసంశయం విద్ధి నిరఞ్జనం మాం 

    స్వరూపనిర్వాణమనామయోఽహమ్  ౨౩॥

సందేహం లేకుండా  తెలుసుకోనాకు సర్వమూ సుస్పష్టం గా ఉంది సందేహం లేకుండా తెలుసుకో నేను ఎల్లప్పుడూ  ఉండేవాణ్ణి

సందేహం లేకుండా తెలుసుకోనేను  మరకాలేని శుద్ధుడిని.

నాస్వరూపం మాయ లేకుండా వెలిగే నిర్వాణమే

 

ధ్యానాని సర్వాణి పరిత్యజన్తి

    శుభాశుభం కర్మ పరిత్యజన్తి 

త్యాగామృతం తాత పిబన్తి ధీరాః

    స్వరూపనిర్వాణమనామయోఽహమ్  ౨౪॥

అన్ని ధ్యానాలూ వదిలిశుభాశుభ కర్మలు అన్నీ వదిలిధీరులు త్యాగం అనే అమృతాన్ని తాగుతారునా స్వరూపంమాయలేకుండా వెలిగే నిర్వాణమే

 

విన్దతి విన్దతి  హి  హి యత్ర

    ఛన్దోలక్షణం  హి  హి తత్ర 

సమరసమగ్నో భావితపూతః

    ప్రలపతి తత్త్వం పరమవధూతః  ౨౫॥

   ఏమీతెలియనప్పుడు అక్కడ శ్లోకాలూఛందస్సు ఉండదు సమత్వం అయిన బ్రహ్మములో  ముణిగి ఉండే పవిత్రుడుపరబ్రహ్మలో నిలిచే అవధూత తత్వాన్ని పలుకుతాడు

 

ఇతి చతుర్థోఽధ్యాయః  ౪॥

 

 

 

అథ పఞ్చమోధ్యాయః 

 

ఓం ఇతి గదితం గగనసమం తత్

     పరాపరసారవిచార ఇతి 

అవిలాసవిలాసనిరాకరణం

    కథమక్షరబిన్దుసముచ్చరణమ్  ౧॥

ఓంకారం ఆకాశం లాంటిది అంటారుఅక్కడ ఇది నాది అది పరులది  అనే భేద భావన లేదుఏదైతే లేదో అలాంటిదాన్ని నిరాకరించడానికి అక్షరాలూబిందువులూ వాటిని ఉచ్చరించడమూ,ఇలాంటివి అన్నీ కావాలా

 

ఇతి తత్త్వమసిప్రభృతిశ్రుతిభిః

    ప్రతిపాదితమాత్మని తత్త్వమసి 

త్వముపాధివివర్జితసర్వసమం

    కిము రోదిషి మానసి సర్వసమమ్  

తత్త్వ మసి అనే శ్రుతులు   ప్రతిపాదించేది ఏమిటంటే అవిద్యని వదలిన నువ్వే , తత్త్వమసి అనబడే  బ్రహ్మానివిశరీరాన్ని వదిలితే సర్వ సమం అయిన ఆత్మవి నువ్వే అయినప్పుడు సర్వ సముడివైన  నువ్వు ఎందుకు నీ మనస్సులోఏడుస్తావు?.

 

అధ ఊర్ధ్వవివర్జితసర్వసమం

    బహిరన్తరవర్జితసర్వసమమ్ 

యది చైకవివర్జితసర్వసమం

    కిము రోదిషి మానసి సర్వసమమ్  ౩॥

పైన    అనే భావాన్ని వదిలిన సర్వ సమమైన ఆత్మలోపలా బయటా అనే విశేషణాలు వదిలిన సర్వ సమమైన ఆత్మఏదైతే ఒక్కటే అయినదాన్ని కూడా వదిలిన సర్వ సమమైన ఆత్మవి నువ్వే అయినప్పుడు సర్వ సముడివైన  నువ్వుఎందుకు నీ మనస్సులో ఏడుస్తావు


 హి కల్పితకల్పవిచార ఇతి

     హి కారణకార్యవిచార ఇతి 

పదసన్ధివివర్జితసర్వసమం

    కిము రోదిషి మానసి సర్వసమమ్  ౪॥

కల్పనా,    కల్పించిన వాడూ అనే ఆలోచనలని వదిలికారణమూకార్యమూ అనే ఆలోచన వదిలి పదాలూసంధులూవంటి వ్యాకరణ విశేషాలని వదిలి సర్వ సమమైన ఆత్మ వెలుగుతుంటే సర్వ సముడివి అయిన నువ్వు ఎందుకు నీమనస్సులో ఏడుస్తావు?.

 

 హి బోధవిబోధసమాధిరితి

     హి దేశవిదేశసమాధిరితి 

 హి కాలవికాలసమాధిరితి

    కిము రోదిషి మానసి సర్వసమమ్  ౫॥

బోధించటమూబోధించకపోవటమూసమాధి అనేవి లేనేలేవుదేశమూవిదేశమూవాటిని దాటిన సమాధి అనేవిలేవుకాలమూకాలం లేకపోవటమూరెంటినీ దాటిన సమాధి లేనేలేవుమరి ఎందుకు సర్వ సముడివి అయిననువ్వు నీ మనస్సులో ఏడుస్తావు?.

 

 హి కుమ్భనభో  హి కుమ్భ ఇతి

     హి జీవవపుర్న హి జీవ ఇతి 

 హి కారణకార్యవిభాగ ఇతి

    కిము రోదిషి మానసి సర్వసమమ్  ౬॥

కుండ   లేదుకుండలో ఆకాశము లేదుజీవుడు లేడుజీవుడి దేహమూ లేదుకారణమూకార్యమూ అనే విభజనాలేదుమరి ఎందుకు సర్వ సముడివి అయిన నువ్వు నీ మనస్సులో ఏడుస్తావు?.

 

ఇహ సర్వనిరన్తరమోక్షపదం

    లఘుదీర్ఘవిచారవిహీన ఇతి 

 హి వర్తులకోణవిభాగ ఇతి

    కిము రోదిషి మానసి సర్వసమమ్  ౭॥

 ఇక్కడ అంతా అంతులేని మోక్ష పదమే ఉందిపొట్టిదాపొడుగుదా అనే ఆలోచన ఇక్కడ లేదు. ,గుండ్రం గా ఉన్నదాకోణాలతో ఉన్నదా అనేభేదాలు లేవుమరి ఎందుకు సర్వ సముడివి అయిన నువ్వు నీ మనస్సులో ఏడుస్తావు?.


ఇహ శూన్యవిశూన్యవిహీన ఇతి

    ఇహ శుద్ధవిశుద్ధవిహీన ఇతి 

ఇహ సర్వవిసర్వవిహీన ఇతి

    కిము రోదిషి మానసి సర్వసమమ్  ౮॥

ఇక్కడ శూన్యమూఎక్కువ శూన్యమూ అనేవి లేవుశుద్ధమూఎక్కువ శుద్ధమూ అనేవి లేవుపూర్తిగా ఉండటమూఇంకా పూర్తిగా ఉండటమూ అనేవి లేవుమరి ఎందుకు సర్వ సముడివి అయిన నువ్వు నీ మనస్సులో ఏడుస్తావు?.

 

 హి భిన్నవిభిన్నవిచార ఇతి

    బహిరన్తరసన్ధివిచార ఇతి 

అరిమిత్రవివర్జితసర్వసమం

    కిము రోదిషి మానసి సర్వసమమ్  ౯॥

భిన్నంగా ఉన్నదీఎక్కువ భిన్నంగా ఉన్నదీ అనే విచారమే ఇక్కడ లేదుబయటాలోపలామధ్యలో అనే విచారమేలేదుశత్రువూమిత్రుడూ అనే విచారణే ఇక్కడ  లేదుమరి ఎందుకు సర్వ సముడివి అయిన నువ్వు నీ మనస్సులోఏడుస్తావు?.

 

 హి శిష్యవిశిష్యస్వరూప ఇతి

     చరాచరభేదవిచార ఇతి 

ఇహ సర్వనిరన్తరమోక్షపదం

    కిము రోదిషి మానసి సర్వసమమ్  ౧౦॥

శిష్యులూ,   విశిష్యులూ అనేది లేదుకదిలేదీకదలనిదీ అనే భేదాన్ని విచారించటమే లేదుఇక్కడ ఎప్పుడూ అంతటాఉండేది మోక్ష పదంమరి ఎందుకు సర్వ సముడివి అయిన నువ్వు మనస్సులో ఏడుస్తావు?.

 

నను రూపవిరూపవిహీన ఇతి

    నను భిన్నవిభిన్నవిహీన ఇతి 

నను సర్గవిసర్గవిహీన ఇతి

    కిము రోదిషి మానసి సర్వసమమ్  ౧౧॥

అది రూపం కలదీరూపం లేనిదీ  అనే రెండూ లేనిదిఅది తేడాలు ఉన్నదితేడాలు లేనిది , అది పుట్టుకానాశమూరెండూ లేనిదిమరి ఎందుకు సర్వ సముడివి అయిన నువ్వు నీ మనస్సులో ఏడుస్తావు?.

 

 గుణాగుణపాశనిబన్ధ ఇతి

    మృతజీవనకర్మ కరోమి కథమ్ 

ఇతి శుద్ధనిరఞ్జనసర్వసమం

    కిము రోదిషి మానసి సర్వసమమ్  ౧౨॥

గుణాలు ఉండటమూగుణాలు లేకపోవటమూ అనే పాశాలచేత బంధింపబడని నేను ఏవిధంగా పుట్టుకాచావులకిసంబంధించిన కర్మలు చేయగలను దోషాలూ లేనిదీశుద్ధమైనదీ  అన్నిటిలో సమంగా వెలిగే ఆత్మ ఒక్కటే ఉన్నది మరి ఎందుకు సర్వ సముడివి అయిన నువ్వు నీ మనస్సులో ఏడుస్తావు?.

 

ఇహ భావవిభావవిహీన ఇతి

    ఇహ కామవికామవిహీన ఇతి 

ఇహ బోధతమం ఖలు మోక్షసమం

    కిము రోదిషి మానసి సర్వసమమ్  ౧౩॥

ఇక్కడ ఆలోచనలూవాటి ఆచరణల వల్ల కలిగిన వైభవాలూ లేవుఇక్కడ కోరికలు ఉండటమూ , కోరికలు వదలటమూలాంటివి లేవుమోక్షానికి సమమైన బోధ ఇక్కడ ఉన్నదిమరి ఎందుకు సర్వ సముడివి అయిన నువ్వు మనస్సులోఏడుస్తావు?.

 

ఇహ తత్త్వనిరన్తరతత్త్వమితి

     హి సన్ధివిసన్ధివిహీన ఇతి 

యది సర్వవివర్జితసర్వసమం

    కిము రోదిషి మానసి సర్వసమమ్  ౧౪॥

ఇక్కడ ఉండే తత్త్వం ఎప్పటికీ ఉండే తత్త్వంఅది సంధుల లాంటి వ్యాకరణ విశేషాలు లేనిదిఅది అన్నిటినీ వదిలినసర్వ సమమైన ఆత్మమరి ఎందుకు సర్వ సముడివి అయిన నువ్వు మనస్సులో ఏడుస్తావు?.

 

అనికేతకుటీ పరివారసమం

    ఇహసఙ్గవిసఙ్గవిహీనపరమ్ 

ఇహ బోధవిబోధవిహీనపరం

    కిము రోదిషి మానసి సర్వసమమ్  ౧౫॥

ఇల్లేలేకుండా ఉన్నదీపరివారంతో కూడిన చక్కని కుటీరం ఉన్నదీరెండూ అయిన  సర్వ  సమమైన ఆత్మసంబంధంఉన్నదీసంబంధం సరిగా లేకుండా ఉన్నదీ  అనే రెండూ లేని పరమమైన బ్రహ్మముబోధాబోధ లేకుండా ఉన్నదీ అనేరెండూ లేని పరమాత్మసర్వ సముడివి అయిన నువ్వు మరి ఎందుకు మనస్సులో ఏడుస్తావు?.

 

అవికారవికారమసత్యమితి

    అవిలక్షవిలక్షమసత్యమితి 

యది కేవలమాత్మని సత్యమితి

    కిము రోదిషి మానసి సర్వసమమ్  ౧౬॥

మార్పులేనిదీ మార్పు  చెందేదీ అనే తేడా అసత్యంసామాన్య మైనదీఅసామాన్యమైనదీ అనే భేదం అసత్యంఆత్మఒక్కటే సత్యం అయినప్పుడుసర్వ సముడివి అయిన నువ్వు మరి ఎందుకు మనస్సులో ఏడుస్తావు?.

 

ఇహ సర్వసమం ఖలు జీవ ఇతి

    ఇహ సర్వనిరన్తరజీవ ఇతి 

ఇహ కేవలనిశ్చలజీవ ఇతి

    కిము రోదిషి మానసి సర్వసమమ్  ౧౭॥

ఇక్కడ సర్వ సమమైన ఆత్మ అన్ని జీవరాశుల్లోనూ ఉన్నది ఆత్మే ఎప్పుడూ ఉండే జీవరూప చైతన్యంఇక్కడ ఆత్మఒక్కడే కదలిక లేకుండా అన్ని జీవాల్లో ఉన్నాడుసర్వ సముడివి అయిన నువ్వు మరి ఎందుకు మనస్సులో ఏడుస్తావు?.

 

అవివేకవివేకమబోధ ఇతి

    అవికల్పవికల్పమబోధ ఇతి 

యది చైకనిరన్తరబోధ ఇతి

    కిము రోదిషి మానసి సర్వసమమ్  ౧౮॥

అవివేకమూ,   వివేకమూరెండూ దాటిన చెప్పలేని ఆత్మ  ఇదిమార్పులు లేనిదీమార్పులు కపదీ అనే రెండూ దాటినచెప్పలేని ఆత్మ  ఇదిఎల్లప్పుడూ  ఒక్కటే ఆత్మ ఉంటే సర్వ సముడివి అయిన నువ్వు మరి ఎందుకు మనస్సులోఏడుస్తావు?.


 

 హి మోక్షపదం  హి బన్ధపదం

     హి పుణ్యపదం  హి పాపపదమ్ 

 హి పూర్ణపదం  హి రిక్తపదం

    కిము రోదిషి మానసి సర్వసమమ్  ౧౯॥

మోక్షమూ,   బంధమూ అనేవి లేనేలేవుపుణ్యమూపాపమూ అనేవి లేనేలేవుసంపూర్ణమైనదీఆవరించబడనిదీఅనేవి లేనేలేవుసర్వ సముడివి అయిన నువ్వు మరి ఎందుకు మనస్సులో ఏడుస్తావు?.

 

యది వర్ణవివర్ణవిహీనసమం

    యది కారణకార్యవిహీనసమమ్ 

యదిభేదవిభేదవిహీనసమం

    కిము రోదిషి మానసి సర్వసమమ్  ౨౦॥

రంగులతోనూరంగులు లేకుండానూ  ఆత్మ ఉంటే , కారణమూకార్యమూ అనే భేదాలు లేకుండా  ఆత్మ ఉంటే , భేదాలూవిభేదాలూ లేకుండా  ఆత్మ ఉంటే సర్వ సముడివి అయిన నువ్వు మరి ఎందుకు మనస్సులో ఏడుస్తావు?.

 

ఇహ సర్వనిరన్తరసర్వచితే

    ఇహ కేవలనిశ్చలసర్వచితే 

ద్విపదాదివివర్జితసర్వచితే

    కిము రోదిషి మానసి సర్వసమమ్  ౨౧॥

ఇక్కడ  ఆత్మ ఎల్లప్పుడూ తన చైతన్య స్వరూపం లో అంతటా నిండి ఉన్నదిఇక్కడ కదలికలు లేని చైతన్యం ఒక్కటేఅంతటా నిండి ఉందిమనుషుల లాంటి రెండు కాళ్ళతో నడిచే జంతువులు ఏవీ లేని శుద్ధ చైతన్యం అంతటాఉన్నప్పుడు సర్వ సముడివి అయిన నువ్వు మరి ఎందుకు మనస్సులో ఏడుస్తావు?.

 

అతిసర్వనిరన్తరసర్వగతం

    అతినిర్మలనిశ్చలసర్వగతమ్ 

దినరాత్రివివర్జితసర్వగతం

    కిము రోదిషి మానసి సర్వసమమ్  ౨౨॥

ఆత్మ ఎల్లప్పుడూ   అన్నిటి లోపల వెలిగేదీ , నిర్మలమూనిశ్చలమూ అయి అన్నిటా ఉండేదీపగలూ రాత్రీ భేదాలు ఏమీలేకుండా అంతటా ఉండేదీ అయినప్పుడు సర్వ సముడివి అయిన నువ్వు మరి ఎందుకు మనస్సులో ఏడుస్తావు?.

 

 హి బన్ధవిబన్ధసమాగమనం

     హి యోగవియోగసమాగమనమ్ 

 హి తర్కవితర్కసమాగమనం

    కిము రోదిషి మానసి సర్వసమమ్  ౨౩॥

బంధాల్లో ఇరుక్కోవడమూవాటినుంచి బయటపడటమూ అనేవి లేవుజీవ ఈశ్వరులు కలవటమూవిడిపోవటమూఅనేవి లేవుతర్కాలూవాటి మీద వాదవివాదాలూ అనేవి లేవుసర్వ సముడివి అయిన నువ్వు మరి ఎందుకుమనస్సులో ఏడుస్తావు?.

 

ఇహ కాలవికాలనిరాకరణం

    అణుమాత్రకృశానునిరాకరణమ్ 

 హి కేవలసత్యనిరాకరణం

    కిము రోదిషి మానసి సర్వసమమ్  ౨౪॥

ఇక్కడ కాలాన్నీకాలం లేకపోవటాన్నీ తిరస్కరించిఅణుమాత్రమైనా ఆత్మకన్నా వేరే ఉన్నది అనే అజ్ఞానాగ్నినితిరస్కరించిఒక్కటే అయిన సత్యాన్ని తిరస్కరించకుండా ఉన్నప్పుడు సర్వ సముడివి అయిన నువ్వు మరి ఎందుకుమనస్సులో ఏడుస్తావు?.

 

ఇహ దేహవిదేహవిహీన ఇతి

    నను స్వప్నసుషుప్తివిహీనపరమ్ 

అభిధానవిధానవిహీనపరం

    కిము రోదిషి మానసి సర్వసమమ్  ౨౫॥

 ఆత్మ దేహము ఉండటమూదేహము లేకుండా ఉండటమూ అనే రెండూ లేనిదినిజంగా  ఆత్మ కలానిద్రాదాటిన పరబ్రహ్మము ఆత్మ పేర్లూపద్ధతులూ అనేవి లేనిదిసర్వ సముడివి అయిన నువ్వు మరి ఎందుకుమనస్సులో ఏడుస్తావు?.

 

గగనోపమశుద్ధవిశాలసమం

    అతిసర్వవివర్జితసర్వసమమ్ 

గతసారవిసారవికారసమం

    కిము రోదిషి మానసి సర్వసమమ్  ౨౬॥

ఆత్మ శుద్ధమూవిశాలమూ అయిన ఆకాశం లాంటిదిఅన్నింటినీ పూర్తిగా వదిలి అన్నిటిలో సమంగా వెలిగేదిసారంఉండటమూలేకపోవడమూ అనే భేదాలు దాటి సమంగా వెలుగుతుంటే సర్వ సముడివి అయిన నువ్వు మరి ఎందుకుమనస్సులో ఏడుస్తావు?.

 

ఇహ ధర్మవిధర్మవిరాగతర-

    మిహ వస్తువివస్తువిరాగతరమ్ 

ఇహ కామవికామవిరాగతరం

    కిము రోదిషి మానసి సర్వసమమ్  ౨౭॥

ఇక్కడ ధర్మాన్నీఅధర్మాన్నీ సంపూర్ణంగా వదలివస్తువు ఉండటాన్నీలేకుండటాన్నీ వదలికామం ఉండటాన్నీలేకుండటాన్నీ వదిలి ఆత్మ వెలుగుతున్నప్పుడు సర్వ సముడివి అయిన నువ్వు మరి ఎందుకు మనస్సులో ఏడుస్తావు?.

 

సుఖదుఃఖవివర్జితసర్వసమ-

    మిహ శోకవిశోకవిహీనపరమ్ 

గురుశిష్యవివర్జితతత్త్వపరం

    కిము రోదిషి మానసి సర్వసమమ్  ౨౮॥

సుఖాలూ,    దుఃఖాలూ  వదిలిన సర్వ సమమైన ఆత్మశోకం ఉండటమూలేకుండటమూ లేని పరబ్రహ్మముగురువూశిష్యుడూ  అనే భావాలు వదిలిన తత్తవ్ స్వరూపుడైన పరమాత్మ ఉన్నప్పుడు సర్వ సముడివి అయిన నువ్వుమరి ఎందుకు మనస్సులో ఏడుస్తావు?.

 

 కిలాఙ్కురసారవిసార ఇతి

     చలాచలసామ్యవిసామ్యమితి 

అవిచారవిచారవిహీనమితి

    కిము రోదిషి మానసి సర్వసమమ్  ౨౯॥

నిజానికి ప్రపంచం అనే మొలక లేదు మొలక యొక్క సారమూ సారం లేకపోవటమూ అనేవి లేవుకదిలేవీకదలనివీపోలికలున్నవీలేనివీ అనేవి లేవుఆత్మ విచారించడమూ , విచారించకుండా ఉండటమూ అనేవి లేనిదిసర్వ సముడివి అయిన నువ్వు మరి ఎందుకు మనస్సులో ఏడుస్తావు?.

 

ఇహ సారసముచ్చయసారమితి 

    కథితం నిజభావవిభేద ఇతి 

విషయే కరణత్వమసత్యమితి

    కిము రోదిషి మానసి సర్వసమమ్  ౩౦॥

ఇక్కడ ఉన్నటు వంటి అన్నిటికీ సారమైన ఆత్మ నేను అనే జీవ భావం కంటే వేరైనదివిషయాలని నేనునడుపుతున్నాను అనే జీవభావం అసత్యమైనదిసర్వ సముడివి అయిన నువ్వు మరి ఎందుకు మనస్సులోఏడుస్తావు?.

 

బహుధా శ్రుతయః ప్రవదన్తి యతో

    వియదాదిరిదం మృగతోయసమమ్ 

యది చైకనిరన్తరసర్వసమం

    కిము రోదిషి మానసి సర్వసమమ్  ౩౧॥

వేదాలు  అనేక మార్లు ఆకాశంతో ఏర్పడ్డ ప్రపంచం ఎండమావి లాంటిది అని చెప్పాయిఎప్పుడూ ఒక్కటే అయి అంతటాఆత్మ ఉన్నదిసర్వ సముడివి అయిన నువ్వు మరి ఎందుకు మనస్సులో ఏడుస్తావు?.

 

విన్దతి విన్దతి  హి  హి యత్ర

    ఛన్దోలక్షణం  హి  హి తత్ర 

సమరసమగ్నో భావితపూతః

    ప్రలపతి తత్త్వం పరమవధూతః  ౩౨॥

తెలుకోవటమే లేనప్పుడు ఛందస్సూదాని లక్షణాలూ ఉండవుసమత్వం అనే అగ్నిని భావించి దాంట్లో కాలిపవిత్రుడైన అవధూత పరమమైన తత్త్వాన్ని చెబుతున్నాడు

 

ఇతి పఞ్చమోఽధ్యాయః  ౫॥

 

 

పేరు మార్పు

అబ్బ, ఆగవయ్యా, ఒకటే తొందర పెడుతున్నావు. కాసేపు మమ్మల్ని మా అమ్మతో ముచ్చట్లు చెప్పుకోనీ?..  ఎంత సేపూ నీ గొడవేనా?. ఏమిటీ, పెళ్ళి ముహూర్తం దగ్గ...